దేశంతో పాటు రాష్ట్ర సంపదను లూటీ చేసిన పారిశ్రామికవేత్త ఆదానిని వెంటనే అరెస్టు చేయాలని, సిపిఎం మండల కన్వీనర్ పక్కిరి సాహెబ్ డిమాండ్ చేశారు. సోమవారం పగిడ్యాల మండలంలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన చేయడం జరిగింది. మండల కన్వీనర్ పక్కిరి సాహెబ్ మాట్లాడుతూ అదాని అవినీతి సామ్రాజ్యం వెనక ప్రధాని మోడీ అండదండలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తిక్క స్వామి, హుసేనమ్మ, ఈశ్వరయ్య, వీరమ్మ, తదితరులు పాల్గొన్నారు.