నాణ్యమైన ఆహార పదార్థాలు విద్యార్థులకు ఇవ్వండి- కలెక్టర్

51చూసినవారు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పధకం ద్వారా పాఠశాల విద్యార్థులు సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం వడ్డించే ఆహార పదార్థాలు మొక్కుబడి రీతిలో గాకుండా నాణ్యతతో అందించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి వంట ఏజెన్సీలను ఆదేశించారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్