పాణ్యం: టీడీపీ అరాచకాలను అడ్డుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు

82చూసినవారు
పాణ్యం: టీడీపీ అరాచకాలను అడ్డుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు
ఓర్వకల్లు మండలం పాలకొలనులో టీడీపీ నాయకుల అరాచకాలను అడ్డుకోవాలని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి సోమవారం కర్నూలులో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషాను కోరారు. పేదలకు ఇళ్ల కోసం ఇచ్చిన స్థలాలను ఆక్రమించిన సుధాకర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని విన్నవించారు. టీడీపీ నేతల నుంచి పేదలకు రక్షణ కల్పించాలని, భూమి కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్