ఓర్వకల్లులో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఆదివారం ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఎంఎస్పీ అధికార ప్రతినిధి కాశపోగు సూరి మాదిగ, రాష్ట్ర కార్యదర్శి కాశపోగు పరమేష్ మాదిగలు హాజరయ్యారు. మండల సీనియర్ నాయకులు గుండమయ్య మాదిగ, శ్రీను మాదిగ ఆధ్వర్యంలో మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా బొగ్గుల మహేంద్రబాబు మాదిగను ఎన్నుకున్నారు.