పాణ్యం: విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం

66చూసినవారు
ఓర్వకల్లు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శనివారం బడి వైపు ఒక అడుగు తల్లితండ్రులతో ముచ్చట్లు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. తహసీల్దార్ విద్యాసాగర్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్