పాణ్యం: రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి
సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. గురువారం గడివేముల మండలం మంచాలకట్ట, గని గ్రామ పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓర్వకల్లు పారిశ్రామికవాడగా తీర్చిదిద్ది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారన్నారు.