వంద రోజుల్లోనే ప్రజలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేసింది
వంద రోజుల్లోనే పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, అన్నివర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వమని న్యాయం చేస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి అన్నారు. బుధవారం పాణ్యం మండలం తొగిర్చేడులో ఇది మంచి ప్రభుత్వంలో పాల్గొని, మాట్లాడారు. వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. ఇంటింటికి వెళ్లి, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలు పంపిణీ చేశారు.