పాణ్యం: నూతన ప్రభుత్వ భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే గౌరు
గడివేముల మండలం బుజునూరు, మంచాలకట్ట నూతన గ్రామ సచివాలయం, ఆరోగ్య కేంద్రం, రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. గురువారం ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ. 80 వేల చెక్కును గడివేముల మండల కేంద్రానికి చెందిన చాకలి పెద్దన్నకు అందజేశారు.