వెల్దుర్తిలో 62. 4 మి. మీ వర్షపాతం నమోదు

79చూసినవారు
వెల్దుర్తిలో 62. 4 మి. మీ వర్షపాతం నమోదు
వెల్దుర్తి మండలంలో శనివారం నుంచి ఆదివారం వరకు కురిసిన వర్షపాతం 62. 4 మి. మీలుగా నమోదైనట్లు ఏఎస్ఓ అభిమన్యు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కుండపోతగా మండలంలో కురిసిన వర్షంతో పుల్లగుమ్మి, కలుగొట్ల, రామళ్లకోట వీధులు జలమయమవగా, ఆయా గ్రామాలతో పాటు బోయనపల్లె గ్రామ పరిధిలోని పొలాల్లో నీరు నిలిచి పంటకు నష్టం కలిగించింది. మండలంలో కురిసిన వర్షం అధిక శాతం పంటలకు ఊపిరి పోసిందని ఏవో అక్బర్ బాషా తెలిపారు.

సంబంధిత పోస్ట్