పత్తికొండ: దుకాణంలో చోరీ.. రూ. 1. 50 లక్ష నగదు అపహరణ

66చూసినవారు
పత్తికొండ పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలోని ప్లాస్టిక్, స్టీల్ దుకాణంలో చోరీ జరిగింది. గురువారం దుకాణం పక్కనున్న చింత చెట్టు ద్వారా దొంగలు పైకి చేరుకుని పైకప్పు రేకు కట్ చేసి నగదు, వస్తువులు చోరీ చేశారు. సుమారు రూ. 1. 50 లక్ష నగదు, రోల్డ్ గోల్డ్, ఇతర వస్తువులు చోరీ చేసినట్లు యజమాని జమ్మన్న తెలిపారు. అర్బన్ సీఐ జయన్న, ఎస్సై వెంకటేశ్వర్లు దుకాణాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్