మహానందిలో పల్లకి సేవ

59చూసినవారు
మహానందిలో పల్లకి సేవ
నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహానందిలో సోమవారం కామేశ్వరీ సమేత మహానందీశ్వర స్వామి వార్ల పల్లకీ సేవను నిర్వహించారు. స్వామివార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి ప్రత్యేక అలంకారం చేశారు. వేద పండితులు నాగేశ్వర శర్మ, హనుమంతు శర్మలు వేద మంత్రాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తుల ఓంకార నామస్మరణలతో పల్లకీ సేవను ఆలయంలో ప్రదక్షణగా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్