శ్రీశైలం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

58చూసినవారు
శ్రీశైలం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
కారు ప్రమాదంలో ఇవాళ ముగ్గురు మృతిచెందారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌‌కు చెందిన వారు కారులో శ్రీశైలం వెళ్తున్నారు. నిర్మల్‌ జిల్లా బూర్గుపల్లి వద్ద జాతీయ రహదారిపై వారి కారుకు ఓ కోతి అడ్డువచ్చింది. దీంతో డ్రైవర్‌ దానిని తప్పించేందుకు ప్రయత్నించడంతో కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని నిర్మల్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్