వైకెపి ఎపిఎం విధులు నిర్వహిస్తున్న కేసీ వీరన్న కు గురువారం కర్నూలు జిల్లాలోని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ భాష చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. జిల్లాలో ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నందవరం మండలములోని డిఆర్డీఎ - వైకెపి ( వెలుగు ) నందు ఏపీఎం గా విధులు నిర్వహిస్తున్న కె. సి వీరన్న ఉత్తమ ప్రతిభా ఉద్యోగి గా అవార్డు అందుకున్నారు. పలువురు అభినందనలు తెలిపారు.