గోనెగండ్ల మండల పరిధిలోని కులుమాల సచివాలయం సమీపంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ నేలకు అతి సమీపంలో ఉంది. వాటి చుట్టూ పిచ్చి మొక్కలు మొలకెత్తి పచ్చగా ఉండి ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. ఏ క్షణంలోనైనా మూగజీవాలు గడ్డి తినడానికి వెళ్లి ప్రమాదం బారిన పడే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆదివారం వాపోయారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ట్రాన్సఫార్మర్ కు రక్షణ కవచాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.