గోనెగండ్ల పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఎవరైనా బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ గంగాధర్ హెచ్చరించారు. శుక్రవారం గోనెగండ్ల పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడారు. గోనెగండ్లలో ప్రభుత్వ అనుమతి పొందిన మూడు మద్యం షాపులు ఉన్నాయన్నారు. ఈ షాపులకు అనుబంధంగా గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఎక్కడైనా బెల్టు షాపులు నడుపుతున్నట్లయితే సమాచారం ఇవ్వాలన్నారు.