విద్యుత్ వినియోగదారులపై 2022-2023 సంవత్సరానికి ఇంధన సర్దుబాటు 8113 కోట్ల రూపాయల చార్జీల ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని శనివారం ఎమ్మిగనూరులో సోమప్ప సర్కిల్ నందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ పట్టణ కార్యదర్శి రంగన్న మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎటువంటి చార్జీలు పెంచమని చెప్పిన సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా గద్దెను ఎక్కిన వెంటనే చార్జీలు పెంచే ఆలోచన చేయడం సరికాదన్నారు.