ఎమ్మిగనూరు పట్టణంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వినూత్న రీతిలో భిక్షాటన చేస్తూ, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బుధవారం ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అమీర్ బాషా మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ విద్యపై మోసం చేసినట్లు ఆరోపించారు.