ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలోబుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి వైయస్సార్ సర్కిల్ వరకు ఖాళీ ప్లేట్లు పట్టుకుని బిక్షాటన నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకపోవడాన్ని, ఇచ్చిన హామీలను విస్మరించడం వ్యతిరేకంగా ఈ నిరసన జరిగింది. ఏఐఎస్ఎఫ్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు.