ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ టీచర్ ను వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో వేరే పాఠశాలకు పంపించకుండా ఇక్కడే కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు గురువారం ధర్నా నిర్వహించారు. వేరే పాఠశాలకు పంపించడాని తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అధికారి వర్క్ అడ్జస్ట్మెంట్ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.