చెరువులను తలపించేలా, గుంతలతో నిండిన ఎమ్మిగనూరు -కోడుమూరు ప్రధాన రహదారికి మరమ్మత్తులు చేపట్టాలని సీపీఐ(ఎం. ఎల్) జిల్లా కార్యదర్శి కె. నాగరాజు డిమాండ్ చేశారు. గురువారం ఎమ్మిగనూరు పట్టణంలోని సిపిఐ (ఎంఎల్) ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు- కోడుమూరు బైపాస్ టర్నింగ్ దగ్గర గుంతలలో వరినాట్లు నిరసన వ్యక్తం చేశారు. ఇందులో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యన్న , ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు రామలింగ, అనిల్ ఉన్నారు.