ఎమ్మిగనూరు ప్రధాన రహదారి పై విద్యార్థి సంఘాలు ధర్నా

70చూసినవారు
ఫిట్నెస్ లేని బస్సులు నడపడంతోనే గంజహళ్లి గ్రామం వద్ద ఓ వ్యక్తి దుర్మరణం చెందాడని ఆ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కర్నూల్ ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై శనివారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. వైయస్సార్ విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడుతూ పెట్రోల్ బంక్ కు ఆనుకొని పాఠశాల నిర్వహించుకోవడమే కాకుండా పసి పిల్లల ప్రాణాలతో కూడా పాఠశాల యాజమాన్యం ఆటలు ఆడుకుంటుందని దుయ్యబట్టారు. రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించి పోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని నచ్చజెప్పి ధర్నా విరమింప చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్