అనంతసాగరం: పేకాట శిబిరంపై దాడులు.. భారీగా నగదు స్వాధీనం
పట్టణాల్లో పోలీసులు దాడులు ఎక్కువగా ఉండటంతో గ్రామాలను అడ్డాగా చేసుకుని పేకాటను జోరుగా సాగిస్తున్నారు. నెల్లూరు జిల్లా, అనంతసాగరం మండలం చిలకల మర్రి తోటలో భారీగా పేకాట సాగిస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 8, 08, 465 నగదును, 11 సెల్ ఫోన్లను, 3 కార్లు, 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా ఉండడం విశేషం. ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాలరావు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.