మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) ఎంపి సంజయ్ రౌత్ ఆదివారం డిమాండ్ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారంరోజులు గడస్తున్నా.. ముఖ్యమంత్రి పదవిపై ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రపతి పాలనను ప్రతిపాదించాలని గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీకి సూచించారు.