కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కూకట్ పల్లి Y జంక్షన్ సమీపంలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వేగంగా దూసుకు వచ్చిన కారు బలంగా ఢీకొంది. దీంతో కారు ముందు భాగం మొత్తం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అదృష్టవశాత్తు అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.