సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరగబోయే మాలల సింహగర్జన సభలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచినట్టుగా అంబేద్కర్ అభయహస్తం పథకంలో భాగంగా అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం అందించే పథకాన్ని సీఎం ప్రారంభించనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి అర్హులను గుర్తించి విధివిధానాలు ఖరారు చేసి పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది.