ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్ పేట మండల కేంద్రంలో దారుణమైన పరిస్థితి. ఏఎస్ పేట లోని ప్రధాన మార్గంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ఆ మార్గం గుండా వెళ్లే వందల సంఖ్యలో వాహనదారులు, పాదచారులు, విద్యార్థులు ఇబ్బంది పడక తప్పట్లేదు. వానలు పడితే చాలు వర్షపు నీరు నిల్వ ఉంటుంది దీనికి అధికారులు శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.