Sep 11, 2024, 11:09 IST/
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేఏ పాల్ పోరాటం
Sep 11, 2024, 11:09 IST
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు హోదా అంశంపై పూర్తి వివరాలు సమర్పించాలంటూ కేంద్ర హోం, ఆర్థిక శాఖల కార్యదర్శులు, నీతి ఆయోగ్ ఛైర్మన్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపించారు. ఈ పిల్‌పై తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేశారు.