గూడూరులో అంబరాన్నంటిన ఎమ్మెల్యే విజయోత్సవ ర్యాలీ సంబరాలు

77చూసినవారు
గూడూరులో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కు స్వాగతం పలుకుతూ నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ సంబరాలు అంబరాన్నంటాయి. వేలాది సంఖ్యలో టీడీపీ అభిమానులు గూడూరు బైపాస్ సర్కిల్ వద్దకు చేరుకుని ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలలు, శాలువాలు, పుష్ఫగుచ్ఛాలతో అడుగడుగునా ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నానాజీ, చాన్ బాష, కిరణ్ కుమార్, ఎన్డీయే కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్