ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుకి ఉలవపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉలవపాడు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకు 58 రోజులు నిరాహార దీక్షను చేసి ప్రాణాలను త్యాగం చేశారని, ఆయన ప్రాణ త్యాగం కారణంగా మనకు ప్రత్యేక రాష్ట్రం లభించింది అన్నారు.