కందుకూరు: మొక్కలు నాటిన పొగాకు అధికారులు, రైతులు

79చూసినవారు
కందుకూరు: మొక్కలు నాటిన పొగాకు అధికారులు, రైతులు
స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా లింగసముద్రం మండలంలోని అమ్మపాలెం గ్రామంలో పొగాకు బోర్డు అధికారులు రైతులతో కలిసి బుధవారం మొక్కలు పంపిణీ చేయడంతో పాటు నాటారు. పర్యావరణాన్ని రక్షించడం కోసం పొగాకు రైతులందరూ కనీసం 10 మొక్కలైన నాటాలని పొగాకు వేలం నిర్వహణ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్