కందుకూరు డిఎస్పి, పట్టణ, రూరల్, ఉలవపాడు, వలేటివారిపాలెం పోలీస్ స్టేషన్లను నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ శనివారం సందర్శించారు. కందుకూరు సబ్ డివిజన్ ఆఫీసు, కందుకూరు టౌన్, రూరల్, ఉలవపాడు స్టేషన్ పరిధిలోని గ్రేవ్ కేసుల రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసు స్టేషన్స్ మ్యాప్, చార్ట్ ను, స్టేషన్ పరిధిలో ఉన్న పరిస్థితులు, సిథిలావస్థలో ఉన్న వాహనాలను గురించి తెలుసుకున్నారు.