నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదని వెంటనే నిలుపుదల చేయాలని కోరుతూ కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి కమిటీ సభ్యులు తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. కందుకూరు లోని ప్రభుత్వ కార్యాలయం ఆవరణలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడమనేది సరైన ఆలోచన కాదని దీనిపై మరోసారి విచారణ చేసి అనుకూలమైన స్థలాన్ని చూడాలని వారు కోరారు.