మహిళా కండక్టర్ పై పాసవిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ తెలిపారు. బాధితురాలు సిహెచ్ సుభాషిణి సిపిఐ, ఏఐటియుసి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కందుకూరు ప్రభుత్వాసుపత్రిలో శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న మహిళ కండక్టర్ పై పత్తిపాటి హరిబాబు అనే వ్యక్తి దాడి చేయడం దారుణమని, ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.