నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మలతో పాటు మంత్రులు గొట్టిపాటి, వీరాంజనేయ స్వామి ఎమ్మెల్యేలు దామచర్ల, ఇంటూరి, కందుల, ఇన్ ఛార్జ్ లు లక్ష్మీ, ఎడిషన్ బాబు, కలెక్టర్ తదితరులు మంగళవారం వెలుగొండ ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. అంతమంది పెద్దలు వచ్చినప్పుడు కార్లు కాన్వాయ్ తప్పనిసరి. కానీ వారందరూ స్వయంగా బైకులు డ్రైవ్ చేసుకుంటూ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. వారి వెంట వందలాదిగా పార్టీ శ్రేణులు బైకులతో వచ్చారు.