ఉలవపాడు మండలం మన్నేటికోట ఎస్టీ కాలనీలో దారుణం వెలుగు చూసింది. 9ఏళ్ళ చిన్నారిపై వరుసకు బాబాయి రూపంలో ఉన్న మానవ మృగం అరాచకానికి పాల్పడింది. తినుబండారాలు పెడతానని మాయమాటలు చెప్పి చిన్నారిని తీసుకెళ్ళిన తుమ్మల కార్తీక్ సోమవారం దారుణానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి గురైన ఆ చిన్నారి బాధతో కేకలు పెట్టడంతో ఆ కీచకుడు పరారైనాడు. మంగళవారం ఫిర్యాదు అందుకున్న ఉలవపాడు పోలీసులు చిన్నారిని కందుకూరు హాస్పిటల్ కు తరలించారు.