వలేటివారిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం భారీగా ఆదాయం వచ్చింది. ప్రత్యేక దర్శనానికి రూ. 4, 32, 000, లడ్డు ప్రసాదానికి రూ. 2, 04, 210, అన్న ప్రసాదానికి రూ. 3, 59, 128, తలనీలాలు రూ. 38, 600, వివిధ పూజలు రూ. 37, 600, రూమ్ అద్దెలకు రూ. 31, 830 లు మొత్తం రూ. 11, 46, 904 ఆదాయం వచ్చినట్లు ఆలయం ఈవో సాగర్ బాబు తెలిపారు.