Mar 13, 2025, 08:03 IST/చేవెళ్ల
చేవెళ్ల
రంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య
Mar 13, 2025, 08:03 IST
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. వైన్స్ లో దొంగతనానికి వచ్చిన దుండగులు అక్కడే పని చేస్తున్న చేగురి బిక్షపతి (30) దొంగతానని గమనించి అడ్డుపడగా తన తలపై గట్టిగా కొట్టడంతో బిక్షపతి స్పాట్లోనే మృతి చెందాడు. సీసీ కెమెరా డీవీఆర్ తో సహా తీసుకొని దుండగులు పారిపోయారు. దొంగతనానికి వచ్చింది ఎవరు అనేది దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.