హైదరాబాద్‌లో HCL కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్‌లో HCL టెక్ గ్లోబల్ CEO, ఎండీ విజయ కుమార్‌తో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం చర్చలు జరిపారు. హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో HCL కొత్త క్యాంపస్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. నూతన క్యాంపస్ ఏర్పాటైతే దాదాపు 5 వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.