దగదర్తి మండలం చెన్నూరు వద్ద కావలి కాలువ పూడికతీత పనులను ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కావలి కాలువలో తట్ట మట్టి ఎత్తలేదని విమర్శించారు. 900 క్యూసెక్కుల నీటి లభ్యత ఉండవలసిన కాలువలో 500 క్యూసెక్కులు కూడా ఆయకట్టుకు అందడం లేదన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ రూ.3.84కోట్ల నిధులతో పూడికతీత పనులు చేపట్టామని తెలిపారు.