జగనన్న కాలనీల పేరుతో సేకరించిన 192 ఎకరాల భూ కుంభకోణం పై సిబిసిఐడి దర్యాప్తు చేపట్టాలని కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి అసెంబ్లీలో కోరారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ జగనన్న కాలనీలు ఏర్పాటు చేయదలచిన ప్రాంతంలో కావలి మాజీ ఎమ్మెల్యే ముందస్తుగా రైతుల నుండి ఎకరా పొలంను కేవలం రూ. 13 లక్షలకు కొనుగోలు చేశారని, ఎమ్మెల్యే సతీమణి ఆయన కుమార్తె బ్యాంకు అకౌంట్ల నుండి డబ్బులు తీసి రిజిస్ట్రేషన్లు చేశారన్నారు.