ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవి నాయుడు అదివారం కావలికి చేరుకున్నారు. ఆయనకు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే, రవి నాయుడుని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం కాసేపు వారు కార్యాలయంలో ముచ్చటించారు. తర్వాత కావలి పట్టణంలోని మినీ స్టేడియాన్ని శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడుతో కలిసి కావలి ఎమ్మెల్యే పరిశీలిస్తారు.