కావలి రూరల్ మండలం తుమ్మలపెంట (పట్టపు పాలెం)గ్రామంలో 42 లక్షల రూపాయల నిధులతో సిమెంట్ రోడ్డుకు కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు, టిడిపి నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. పేరుపేరునా ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించారు.