గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఓవర్ హెడ్ ట్యాంక్ లను గుర్తించి వెంటనే కూల్చివేతలు చేపట్టలని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణా రెడ్డి కోరారు. జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే కావ్య శనివారం గళం విప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నపిల్లలు ఆటలు ఆడే సమయంలో శిథిలావస్థలోని ఈ ట్యాంక్ ల వలన ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. డబ్బు కంటే ప్రాణం విలువైనదని తెలిపారు.