మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కావలి డిఎస్పి శ్రీధర్ అన్నారు. కావలి పట్టణంలోని జవహర్ భారతి కళాశాలలో విద్యార్థులకు గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణపై శుక్రవారం అవగాహన కల్పించారు. సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులను కోరారు. వీటిని అమ్మిన వాడిన పోలీస్ శాఖ తీసుకునే చర్యలు జరిగే నష్టాలను వివరించారు.