ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులపై అధిక ఫీజుల భారం మోపి ఇబ్బందులకు గురిచేస్తుందని, ఎందరో విద్యార్థులు ఫీజులు కట్టలేక చదువులను మధ్యలోనే అర్ధాంతరంగా ఆపేస్తున్నారని బిసి ఐక్యత భవన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ అన్నారు. కావలి పట్టణంలో ప్రభుత్వ జూనియర్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయాలని కావలి ఆర్డిఓ వంశీకృష్ణకు సోమవారం వినతిపత్రం అందజేశారు. కళాశాలలో ఏర్పాటుచేసి, పేద ప్రజలను ఆదుకోవాలని కోరారు.