ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి నూతన పాలక మండలిని ప్రభుత్వం ప్రకటించడం సంతోషకరం అని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. కావలిలో గురువారం మాట్లాడుతూ టీటీడీకి నియమితులైన అందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. భక్తుల మనోభావాలను, టీటీడీ ఆగమ, వైదిక శాస్త్రాలను గౌరవిస్తూ తిరుమల ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసేలా నూతన పాలక మండలి కృషి చేస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.