కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఐదేళ్ల పాటు అభివృద్ధి ఆధారాలు లేని పల్లెటూళ్లు పల్లె పండుగ కార్యక్రమంతో ప్రగతి పథంలో దూసుకపోతున్నాయని తెలిపారు. విడవలూరు మండలంలోని ఇందిరా నగర్ మరియు వావిళ్ల గ్రామాలలో 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి శిలా ఫలకాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విడవలూరు తహసిల్దార్ చంద్రశేఖర్, చెముకుల చైతన్య తదితరులు పాల్గొన్నారు.