అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేకశ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. మంగళవారం ఉదయం ఇందుకూరుపేట మండలం కొత్తూరు ఎస్టి కాలనీలోని త్ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు, గర్బిణులకు అందిస్తున్న గుడ్లు, బాలామృతం, చిక్కీలు, కర్జూరం మొదలైన ఆహార పదార్థాలను కలెక్టర్ పరిశీలించారు.