నెల్లూరు నగరంలోని నవాబ్ పేటలో వైభవంగా శ్రీ భ్రమరాంబికా సమేత మల్లేశ్వర స్వామి తెప్పోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ హాజరయ్యారు. బాణసంచా కాంతులలో, విద్యుత్ దీపాలంకరణతో ఆ ప్రాంతమంతా వెలిగిపోయింది. ఈ తెప్పోత్సవాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.