తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి నేరెళ్ల శారద వన్నె తీసుకొని వచ్చారని మాజీ మేయర్ మండలం భాను శ్రీ పేర్కొన్నారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారద తన నివాసానికి వచ్చిన సందర్భంగా ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. నేరెళ్ల శారద తన చిరకాల మిత్రురాలని పేర్కొన్నారు. ప్రతినిత్యం మహిళల సమస్యలపై రాజీ పడకుండా వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న ఘనత నేరెళ్ల శారద దక్కుతుందని ప్రశంసించారు.